Vicky
Thursday 4 December 2008
  ప్రజాస్వామ్యం లో రాజకీయ నాయకులను ఛీ కొట్టచ్చ?
ముంబై లో జరిగిన ఘోరకలికి నిరసనగా ప్రతి ఒక్కరికి రాజకీయ నాయకుల మీద ఏహ్య భావం కలిగింది. కాని ఒక్క సారి అలోచించి చూస్తే తిట్ట వలసింది ఎవరిని? మాక్ డొనాల్డ్స్ దగ్గర క్యూఁ లలో గంటల తరబడి నిల బడి మరి బర్గెర్ పిజ్జా లు తినగలిగే అమ్మడులకి , సినిమా టికెట్స్ కోసం గంటల తరబడి క్యూఁ లలో నిలబడే అయ్యలకి , కెమెరా ల ముందు కొవ్వత్తులు పట్టుకొని ఫోస్ లు కొట్టే సినిమా వాళ్ళకి , వోటింగ్ అనే ప్రక్రియ అనేది ఒకటి వుందని , మనకంటూ ఒక వోట్ హక్కు ఒకటి ఎడిచిందని చాల మందికి తెలియదు పాపం. తెలిసిన వోటింగ్ క్యూఁ లలో దిగువ తరగతి వాళ్ళతో నిలబడి వోట్ వేసే ఓపిక లేదు పాపం. ఏ తప్పు జరిగినాఏ కష్టం కలిగిన ప్రభుత్వాన్ని మొట్ట మొదటగా తిట్టే మనం ఆలోచించాలి. మనకిచిన ఆయుధాన్ని వాడుతున్నమా , ఎందుకిచ్చారు, దాని విలువ ఎంత అని? ఈ పాటికి అర్థం అయ్యే వుంటుంది దాని విలువ ఎంత అనే విషయం. దాని విలువ ఎన్నో దోపిడీలు , దొమ్మీలు, మాన భంగాలు, హత్యలు బోనస్ గ టెర్రరిస్టు ప్రక్రియలు. ఒక్క సారి మన నిబద్ధత ఎంత అని కొలిచి చూస్తే . మనం ఒక బిజినెస్ మాన్ కొడుకు ఐతే , టాక్స్ కట్టకుండా మన తల్లి దండ్రులు మనలని పెంచారని , ఉద్యోగస్తుల కొడుకులైతే అవినీతి సంపాదన తో మనలని తీర్చి దిద్దరాని సిగ్గు వెయ్యక మానదు. ఇక రాజకీయ నాయకుల కొడుకులైతే ఎలాగు ఈ మాత్రం సిగ్గు పాడటానికి కూడా అవకాసం వుండదు. ఇక వోట్ వెయ్యని వాళ్ల విషయం పక్కన పెడితే , డబ్బు కి అమ్ముడి పోయి, సార కి లొంగి, కులానికి బానిస అయ్యి , మతోన్మాదం లో ముంగి పోయి విలువలకి తిలోదకాలిచ్చిన మన జనానికి రాజకీయ నాయకులని తిట్టే హక్కు వుందంటారా ?
 

My Photo
Name:
Location: Hyderabad, AndhraPradesh, India
Archives
01/05/2008 / 01/12/2008 / 01/12/2009 /


Powered by Blogger

Subscribe to
Posts [Atom]