Vicky
Monday 12 May 2008
  రిజర్వేషన్స్ పై ఆలోచించాలి
అవి మండల్ కమిషన్ పై అందరు కలసి పోరాడ్తున్న రోజులు, అప్పట్లో నాకు తెలిసిన ఏకైక విషయం రిజర్వేషన్స్ అంటే అగ్ర కులాలకు అన్యాయం , మనం దాని పై బంద్ లతో మన నిరసన తెలపాలని. ఇక ఆలస్యం యెందుకు అన్నట్టు గా బంద్ చేసే వారూ మా స్కూల్ కి రాక పోయినప్పటికి , నేనే వెళ్లి వారికీ మా స్కూల్ యదా విధిగా నడుస్తుంది దయ చేసి మా స్కూల్ ని మూఇంచండి అని చెప్పడంతో స్టార్ట్ అయ్యింది నా పోరాటం. కాని అప్పట్లో పక్క వారి ఆలోచనల తో నాకు రిజర్వేషన్లు అంటే ద్వేషం ఉండేది. ఇందులో వింతయేమి లేదు , కాని నా ఇంజనీరింగ్ ఐపోయ్యేంత వరకి నేను అలానే ఉన్నాను అంటే , నాకే ఆశ్చర్యం అవుతుంది , నేను యెందుకు అలా వున్నాను అని.

కాని ఒక్క సారి నేను వెనుక బడిన కులలగురుంచి ఆలోచించడం మొదలయ్యినప్పటి నుంచి చాల బాధ అనిపించేది , వారి జీవితాలు కేవలం మరుగుదొడ్లు క్లీన్ చెయ్యడానికి చెప్పులు కుటడానికి మాత్రమే నా అని.అప్పుడే మొదలయ్యింది నా ఆలోచన , ఇన్నాళ్ళ రిజర్వేషన్లు వీరి జీవితాలకి ఏమి చేసినట్టు అని?అరవై ఏళ్ళ రిజర్వేషన్లు అమలు ఎమయ్యినట్టు అని? ఎన్నో రోజులు అలూచించిన నాకు కొన్ని విషయాలు అర్థం అయ్యాయి


అందులో కొన్ని :


౧. ఎస్ సి , ఎస్ టి లలో కూడా ఒక వర్గం వారే ఈ అవకాశాలను వాడుకుంటూ మిగిలిన వారికి చేరనివ్వట్లేదని.


౨.కొన్ని పంచాయత్ ఏలేక్షన్స్ లో ఇప్పటికి ఎస్ సి ఎస్ టి అభ్యర్డులుగా , పెద్దింటి వారి పని మనుషులు , లెదా వారి డెమ్మీ లు అని. మొన్నటికి మొన్న మన మంత్రి గారి(జే.సి.దివాకర్ రెడ్డి గారి) బినామీ లాగ


౩. నాకు అర్థం కాని విషయం అల్లా ఒక్కటే, ఐ.ఏ.ఎస్, ఐ.పీ.ఎస్, రాష్ట్రపతి, మంత్రులు ,ఎం.ఎల్,ఏ ఇలాంటి వారి పిల్లలకి రిజర్వేషన్లు ఎందుకని?


౪.మొత్తంగా ఈ రిజర్వేషన్లు పర్వం లో నష్ట పోయేది మాత్రం బి.సి లే నని నా ప్ర్ఘడ నమ్మకం. ఇక ఒ.సి ల విషానికి వస్తే , వాళ్ళలో అంతో ఇంతో సంపాదించి న సంఖ్య ఎక్కువే . ఒక వేళ సంపాదన లేక పాయిన వారికి సమాజం లో అంతో ఇంతో గౌరం వున్నది.


౫.మొన్నిమధ్య మంద కృష్ణ గారి vargeekarana poratam choosi badha navvu rendu vachayi, ఈ దరిద్రపు రాజకీయ నాయకుల వల్ల మంద కృష్ణ గారికి. manda krushna gaariki ఒక్క సూచన , ఒక వేళ మాలలే ఇవన్ని అనుభవిస్తుంటే , మీరు మీ పోరాటం కుల రహితంగా ఎవరైతే పొందారో ,పొండుతున్నారో , పొండుతూనే వున్నారో వారి పై చేస్తే అన్ని కులాల నుంచి మీకు మద్దతు వుంటుంది. దయ చేసి అన్ని కులాల వారికి విజ్ఞప్తి రాజకీయ నాయకుల చేతిలో కీలు బొమ్మలై అంబేద్కర్ గారి ని అవమాన పరచడ్డు అని.

నాకు తెలుసు ఇది కొందరిని గాయపరిచి వుండచ్చు అని ,అయినా ఇది కేవలం నా బాధ చెప్పుకోడానికి అని నేను అనుకుంటున్నాను ,

ఇట్లు....

చీతిరాల.త్రివిక్రమ రావు

గిద్దలూరు .

 
Comments:
This comment has been removed by the author.
 
Nice writeup..
 
Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

My Photo
Name:
Location: Hyderabad, AndhraPradesh, India
Archives
01/05/2008 / 01/12/2008 / 01/12/2009 /


Powered by Blogger

Subscribe to
Posts [Atom]