Vicky
Wednesday 14 May 2008
  BUDGET2008
చిదంబరం ... హార్వార్డ్ విశ్వ విద్యాలయం నుంచి ఉత్తీర్నులైన వ్యక్తి . ఈయన ప్రవేశ పెట్టిన రైతు రుణ మాఫీ పైన ఇవ్వాల్టి నా బాధ

కాంగ్రెస్ వారు అందరు బడ్జెట్ 2008 ని రైతులకు మేలు చేసేది గా అభివర్నించ వచ్చు కాని ఇది ఎంత వారకి నిజమో మన ఆర్ధిక మంత్రి గారికి , కాంగ్రెస్ వారికి మాత్రమే తెలియాలి .హాస్యాస్పదం ఏమిటంటే వీరికి తోడు మన ఇంకో ఆర్ధిక వేత్త మన్న్మోహనం గారు .ఈయన ఒకానోకప్పుడు ఫ్రీ పవర్ aనేది చాల తప్పు , అది కేవలం ఎలెక్షన్ గిమ్మిచ్కు అని చెప్పారు . కావాలంటే సాక్షం ఇదిగో ....
http://www.tribuneindia.com/2005/20051009/punjab1.htm
మరి అటువంటి PM గారు ఇప్పుడు కర్నాటక లో వారి మానిఫెస్తో గురుంచి మాట్లాడరు ,అది వారి స్టేట్ కి సంబందించిన విషయం అని మాట్లాడలేదుపో ...మరి ఈ రుణాల మాఫీ సెంటర్ కి సంబందించిన విషయమే కదా. ఈయన గారు మొన్నీమధ్య IAS 2007 బాచ్ ప్రోబషనేర్స్ మీటింగ్ లో ఒక విషయం చెప్పారు .. ఈ మధ్య కాలం లో లీడర్స్ లో విజన్ లోపించింది , అందరు స్వల్ప కాలిక ప్రయోజనాల కోసం చేస్తున్నరు తప్ప ఎవ్వరు దీర్ఘకాలిక ప్రయోజనాల గురుంచి ఆలోచించట్లేదు అని ..
మరి విజన్ వున్నా చిదంబరం గారు,మంమోహనం గారు ఈ విషయాలకి సమాధానాలు చెప్పాలి మరి
1. ఇలా మాఫీ చెయ్యడం వల్ల మీరు రైతులకి చెప్పాలనుకున్న దేంటి?ఎప్పటికి రుణాలు చెల్లించ వద్ధన? ఇలా మీరు చేస్తే ఇంకో సారి ఎవరు రుణాలు తిరిగి చెల్లిస్తారు?
2.మరి ఇంత వారకి కష్టపడి చెల్లించిన వారి సంగతేంటి?
3.మీరు నిజంగా వోట్ల గురుంచి ఆలోచించకుంటే ... ఇలా చేసేవారా?
4.బాగా అప్పులు చెల్లించి వారికి ,వడ్డీ మాఫీ చేసి వల్ల కష్టాన్ని పంచుకోవచ్చు కదా ? ఇలా ఐన వేరొకరు కట్టడానికి ఇష్ట పడతారు
5.ఇప్పుడు మీ వంతు, మీరు ఇవ్వాల ఈ పని చేస్తే వేరో పార్టీ వాళ్ళు ఇదే చెయ్యాల్సి వస్తుంది ఆ విషయం గురుంచి ఆలోచించారా ? ఇదే న మీ కున్న vision?
౬.ఇలా మీరు రునలని మాఫీ చేస్తారేమో అన్నా ఆశతో ఎవ్వరు అప్పు తీర్చకపోతే, ఇక పై బ్యాంకు లు రుణాలు సక్రమంగా ఇస్తాయంతర ?
రాజకీయ వేత్తలార .... దయచేసి ఒక విధానాన్ని అమలులోకి తేస్తున్నప్పుడు దాని గురుంచి పది సార్లూ అలోచించి, చర్చించి నిర్ణయం తీసుకోండి.కేవలం వోట్లు కాకుండా .. కొంత దేశ ప్రయోజనలని దృష్టిలో పెట్టుకొని పని చేయండి .
ఇట్లు
చీతిరాలత్రివిక్రమ రావు
గిద్దలూరు
 
Comments:
Who let the dogs out
 
Post a Comment

Subscribe to Post Comments [Atom]





<< Home

My Photo
Name:
Location: Hyderabad, AndhraPradesh, India
Archives
01/05/2008 / 01/12/2008 / 01/12/2009 /


Powered by Blogger

Subscribe to
Posts [Atom]